- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఖమ్మం లోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు

దిశ, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఖమ్మం లోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి హాజరై.. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నడుమ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, సామాజిక న్యాయం అందించేందుకు రాహుల్ గాంధీ నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధానిగా చూడాలనేది ప్రజల ఆకాంక్ష అని, భవిష్యత్తులో ఇది సాకారం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ చౌదరి, సీనియర్ నాయకులు మిక్కిలినేని నరేంద్ర, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, ప్రతిభా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్, టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, నాయకులు కిరణ్ నాయక్, మేడా వెంకట్రావ్, క్రాంతి, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






