- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్.. రిక్వెస్ట్‌ను తిరస్కరించిన కోర్టు
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టు జారీ చేసిన సమన్లపై స్పందించిన ఆయన.. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడం నుండి మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్ నిమిత్తం ముంబైలో బిజీగా ఉన్నానని, అందువల్ల ఈ నెల 22వ తేదీ (సోమవారం) నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాలేనని అల్లు అర్జున్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ (Virtual Appearance) ద్వారా విచారణకు హాజరయ్యేలా అనుమతించాలని ఆయన కోర్టును కోరారు.
పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు..
అల్లు అర్జున్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. అందుకు అనుమతించేందుకు నిరాకరించింది. వీడియో కాన్ఫరెన్స్ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్లో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా (A11) ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు పిటిషన్ను కొట్టేయడంతో.. పూర్వపు ఆదేశాల ప్రకారం ఈ నెల 22వ తేదీ సోమవారం నాడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని స్పష్టమవుతోంది. థియేటర్ యాజమాన్యంతో పాటు నోటీసులు అందుకున్న మిగతా 19 మంది కూడా అదే రోజు కోర్టుకు రానున్నారు.
సంధ్య థియేటర్ కేసులో ట్విస్ట్: హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు






