సాయికృష్ణ మృతదేహాన్ని కాల్చేశారు: వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

యువకుడు సాయికృష్ణను చంపేసి మృతదేహాన్ని కూడా కాల్చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. సాయికృష్ట మిస్సింగ్ మిస్టరీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయికృష్ణ మృతిపై అతని తల్లి విజయలక్ష్మికి ఎవరు సమాధానం చెబుతారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు..

సాయికృష్ణ మృతదేహాన్ని కాల్చేశారు: వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: యువకుడు సాయికృష్ణ(Saikrishna)ను చంపేసి మృతదేహాన్ని కూడా కాల్చేశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Ycp Mp Subbareddy) ఆరోపించారు. సాయికృష్ట మిస్సింగ్ మిస్టరీ(Saikrishna Disappearance Mystery)పై ఆయన మీడియాతో మాట్లాడుతూ సాయికృష్ణ మృతిపై అతని తల్లి విజయలక్ష్మికి ఎవరు సమాధానం చెబుతారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తే ప్రాణాలు తిరిగి వస్తాయా అని నిలదీశారు. తమిళనాడులో ఇలాంటిదే జరిగితే పోలీసులకు జీవితఖైదు విధించారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. అసలు సాయికృష్ణనే లేకుండా ఈ నెల 29లోపు కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.

NHRCకి వెళ్తాం

సాయికృష్ణ, క్రాంతి కుమార్ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోలీసులకు మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. కృష్ణలంక పోలీసుల వేధించడంతో రెండు ఘటనలో చోటు చేసుకున్నాయన్నారు. కృష్ణలంక పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్యకు యత్నించారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story