ఐదు రోజుల లాభాల జోరుకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Malleboina Mahesh |

స్టాక్ మార్కెట్లలో ఐదు రోజుల లాభాలకు బ్రేక్ఐ పడింది. ఐటీ షేర్లలో భారీ అమ్మకాలతో 607 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ 154 పాయింట్లు నష్ట పోయాయి.

ఐదు రోజుల లాభాల జోరుకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ యుద్ధం ముగింపు ప్రకటనతో గత ఐదు రోజులుగా స్టాక్ మార్కెట్లు (Stock markets) భారీ లాభాల్లో కొనసాగాయి. కాగా ఈ ఐదు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ.. శుక్రవారం సాయంత్రం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఐటీ దిగ్గజం 'ఎక్సంచర్' (Accenture) తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించుకోవడంతో ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి వ్యక్తమైంది. దీని ప్రభావంతో దేశీయ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముగింపు సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ (Sensex) 607 పాయింట్లు పతనమై 76,802 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (Nifty) 154 పాయింట్లు దిగజారి 24,013 వద్ద ముగిసింది.

ప్రధానంగా ఇన్‌ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు 2.5 శాతం నుంచి 6 శాతం వరకు నష్టపోయి మార్కెట్లను కుప్పకూల్చాయి. వీటికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIs) నిరంతరాయంగా నిధులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు హెల్త్‌కేర్ రంగాలు కొంతవరకు నిలదొక్కుకున్నప్పటికీ, ఐటీ ఇండెక్స్ భారీగా పడిపోవడంతో సూచీలు కోలుకోలేకపోయాయి.

Next Story