- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ కోరారు.

దిశ, మేడ్చల్: ఈ నెల 20న మేడ్చల్ కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్న లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ సీఐ గోపగాని గురువయ్య గౌడ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సివిల్ కేసులు, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు, బ్యాంకు రుణాల వివాదాలు, రాజీ ద్వారా పరిష్కరించుకునే ఇతర వివాదాలను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.
అదే విధంగా, చిన్న చిన్న తగాదాల నేపథ్యంలో నమోదైన కేసులు, రాజీకి అవకాశం ఉన్న ఇతర కేసుల్లో ఇరు పక్షాలు మేడ్చల్ కోర్టుకు హాజరై పరస్పర అంగీకారంతో తమ వివాదాలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కేసులు ఉన్న ఇరు పక్షాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని సీఐ గురువయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం 8712511290, 8712510710 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.






