కేరళలో ‘బాహుబలి’ రికార్డుకు చెక్.. ‘హ్యాపీ 4K’ సంచలనం

by Pulgam srinivas |

కేరళలో రీ-రిలీజ్ అయిన అల్లు అర్జున్ 'హ్యాపీ' చిత్రం 'బాహుబలి: ది ఎపిక్' సాధించిన మొత్తం కలెక్షన్లను అధిగమించినట్లు సమాచారం.

కేరళలో ‘బాహుబలి’ రికార్డుకు చెక్.. ‘హ్యాపీ 4K’ సంచలనం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ భారీగా పెరిగింది. పాత చిత్రాలను మళ్లీ విడుదల చేస్తే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో పాటు కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను కూడా రాబడుతున్నాయి. దీంతో నిర్మాతలు తమ సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేయడంపై మరింత దృష్టి సారిస్తున్నారు. కొంతకాలం క్రితం 'బాహుబలి' రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

దీంతో ఈ సినిమా రీ-రిలీజ్ రికార్డులను అధిగమించడం అంత సులభం కాదని ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన అల్లు అర్జున్ 'హ్యాపీ' చిత్రాన్ని తాజాగా కేరళలో 4k వర్షన్ లో రీ-రిలీజ్ కాగా అక్కడ 'బాహుబలి: ది ఎపిక్' సాధించిన మొత్తం కలెక్షన్లను అధిగమించినట్లు సమాచారం. దీంతో కేరళలో అల్లు అర్జున్‌కు ఉన్న అపారమైన క్రేజ్ మరోసారి స్పష్టమైందని అభిమానులు, సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక త్వరలోనే అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' చిత్రాన్ని కూడా రీ-రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం రీ-రిలీజ్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

Next Story