హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం..

by Malleboina Mahesh |   (  Updated:2026-06-19 11:21:30  IST  )

హైదరాబాద్‌కు వర్ష సూచన. రాత్రి నగరంలోని పలెు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం.

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం..
X

దిశ, వెబ్ డెస్క్: ఉదయం నుంచి భారీ ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న జిల్లాలు, హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ (Telangana Weatherman) అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు సాయంత్ర తర్వాత సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అలాగే హైదరాబాద్(Hyderabad) లోని ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ వెదర్ మ్యాన్ అంచన ప్రకారం గురువారం సాయంత్రం పశ్చిమ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి, మణికొండ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఆ తర్వాత ఈ వర్షపు మేఘాలు క్రమంగా సెంట్రల్ హైదరాబాద్ (మధ్య భాగం), సౌత్ హైదరాబాద్ (దక్షిణ భాగం) వైపు విస్తరించి.. నగర వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story