నితిన్ సినిమా నుంచి తప్పుకున్న రితికా నాయక్ .. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!

by Mallepaka Hamsa |

ఈ చిత్రం నుండి హీరోయిన్ రితీకా నాయక్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నితిన్ సినిమా నుంచి తప్పుకున్న రితికా నాయక్ .. లక్కీ చాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నితిన్ గత ఏడాది చేసిన తమ్ముడు, రాబిన్ హుడ్ మూవీస్ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయాయి. భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. దీంతో కాస్త నిరాశ చెందిన నితిన్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు. ఈసారి ఎలాగైనా పక్కా హిట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సరికొత్త ప్రాజెక్ట్‌తో సిద్ధమయ్యారు. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా నారి సిరిసవాడ , సోమశేఖర్ అనే ఇద్దరు ప్రతిభావంతులైన యువకులు దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా మొదట రితీకా నాయక్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా పూర్తి కావడమే కాకుండా, షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. పనులన్నీ త్వరగా పూర్తి చేసి, ఈ ఈక్రమంలో.. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రం నుండి హీరోయిన్ రితీకా నాయక్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె తప్పుకోవడానికి గల అసలు కారణాలు ఏంటనేది తెలియనప్పటికీ.. రితీకా స్థానంలో ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. నితిన్ సరసన వైష్ణవి అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని భావించి, మూవీ టీమ్ ఆమెను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Next Story