- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
by Batti.Sumithra |
నందిపేట మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.

X
దిశ, నందిపేట : నందిపేట మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ (45) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. స్థానికంగా రాజేష్ హార్డ్వేర్ దుకాణం నడుపుతూ వ్యాపారం చేస్తున్న ఈయనకు అప్పులు ఎక్కువగా అవడం వల్ల మనస్థాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. దుకాణం నుంచి ఉద్దెర ఖాతాలు ఎక్కువ అవ్వడంతో అప్పులు ఎక్కువై ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులకు గురైనట్లు చెప్పారు. కొన్ని రోజులుగా డబ్బుల విషయమై ఆందోళనకు గురై ఈనెల 17న లక్కంపల్లి శివారులో గడ్డి మందు సేవించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని భార్య హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
Next Story






