ప్రజలకు అలర్ట్.. రెండు గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ప్రజలకు అలర్ట్.. రెండు గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు.. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, కరెంట్ స్తంభాలు, హోర్డింగులు, పంటపొలాల్లో ఉండవద్దని హెచ్చరించింది. మూడు జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండగా.. దాని ప్రభావంతో శనివారం (రేపు) పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది. కాగా.. రాష్ట్రంలో ఇంకొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత కూడా కనిపిస్తుందని వివరించింది.

Next Story