'మా అత్త చనిపోయేలా చూడు స్వామీ'.. దేవుడి హుండీలో కోడలు వింత కోరిక

by Ajay Maddhiboyina |

అత్త‌ను తల్లిలా చూసుకోవాల‌ని చెబుతుంటారు. పెళ్లి త‌ర‌వాత అత్తింట్లో తల్లి ఉండ‌దు కాబ‌ట్టి అక్క‌డ అత్తామామ‌లే త‌ల్లిదండ్రులుగా భావిస్తూ జీవించాల‌ని అంటారు. అయితే ఎంత చెప్పుకున్నా అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు కామ‌న్.

మా అత్త చనిపోయేలా చూడు స్వామీ.. దేవుడి హుండీలో కోడలు వింత కోరిక
X

దిశ, వెబ్ డెస్క్: అత్త‌ను తల్లిలా చూసుకోవాల‌ని చెబుతుంటారు. పెళ్లి త‌ర‌వాత అత్తింట్లో తల్లి ఉండ‌దు కాబ‌ట్టి అక్క‌డ అత్తామామ‌లే త‌ల్లిదండ్రులుగా భావిస్తూ జీవించాల‌ని అంటారు. అయితే ఎంత చెప్పుకున్నా అత్తా కోడ‌ళ్ల మ‌ధ్య చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్థ‌లు కామ‌న్. కొన్ని సార్లు తిట్టుకుంటే మ‌రికొన్నిసార్లు ప్రేమ‌గా ఉంటారు. కానీ ఓ కోడ‌లు మాత్రం దేవుడిని ఎవ‌రూ కోర‌ని కోరిక కోరింది. త‌న అత్త వేధింపులు త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని, ఆమె త్వ‌ర‌గా చ‌నిపోయేలా చూడాల‌ని రూ.20 నోటుపై రాసి హుండీలో వేసింది.

ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా ఆత్మ‌కూరు మండ‌లంలో చోటు చేసుకుంది. గ్రామంలోని పంప‌నూరు సుబ్ర‌హ్మ‌ణ్వేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆల‌య హుండీలోని డబ్బుల‌ను లెక్కిస్తున్న స‌మ‌యంలో పూజారికంట ఓ రూ.20 నోటు ప‌డింది. నోటుపై ఏదో రాసి ఉన్న‌ట్టు క‌నిపించడంతో తీసుకుని చ‌ద‌వ‌గా అందులో .. స్వామీ.. మా అత్త వేధింపులు త‌ట్టులేక‌పోతున్నా.. త్వ‌ర‌గా చ‌నిపోయేలా చూడు అంటూ రాసి ఉంది. అది చ‌దివిన పూజారి కంగుతిన్నాడు. ప్ర‌స్తుతం నోటు ఫోటో సోష‌ల్ మీడియాలో సైతం వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు ఆ కోడలిపై మండిప‌డుతున్నారు.

Next Story