కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధైరా’ సినిమా విడుదల తేదీ ఫిక్స్..

by Mallepaka Hamsa |

ఇక ఇప్పుడు కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధైరా’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధైరా’ సినిమా విడుదల తేదీ ఫిక్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన అద్భుతమైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. 2024లో సింగం అగైన్, క్రూ వంటి చిత్రాలతో మెప్పించారు. ఇక ఇప్పుడు కరీనా కపూర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ధైరా’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మాలీవుడ్ వర్సటైల్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ సంస్థలు జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 18, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తుండగా.. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్‌తో ఆమెకు ఇది మూడవ కొలాబరేషన్ కావడం విశేషం. వెండితెరపై ఎప్పుడూ ఊహించని విధంగా, పవర్‌హౌస్ పర్‌ఫార్మర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లను ఈ సినిమా ద్వారా మొదటిసారి జంటగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పెన్ మరుధర్ సంస్థ ఈ భారీ క్రైమ్ థ్రిల్లర్‌ను పంపిణీ చేస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ మేఘనా గుల్జార్ మార్క్ మేకింగ్‌తో ‘ధైరా’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story