VIRAL: IIM అహ్మదాబాద్ క్లాస్‌రూమ్‌లో ‘ధురంధర్’.. మూవీ సీన్స్‌తో స్టాటిస్టిక్స్ పాఠాలు

by Kema Shiva Kumar |

ఐఐఎం అహ్మదాబాద్‌‌లో ఓ ప్రొఫెసర్ ఒకరు విద్యార్థులకు స్టాటిస్టిక్స్ పాఠం చెప్పడానికి బాలీవుడ్ మూవీ ‘ధురందర్’‌లోని సీన్‌ను ఉపయోగించారు.

VIRAL: IIM అహ్మదాబాద్ క్లాస్‌రూమ్‌లో ‘ధురంధర్’.. మూవీ సీన్స్‌తో స్టాటిస్టిక్స్ పాఠాలు
X

దిశ, వెబ్‌డెస్క్: క్లాస్‌రూమ్‌లో మనకు తెలిసి బ్లాక్ బోర్డుపై బోరింగ్ పాఠాలు, ఫార్ములాలు, సిద్ధాంతాలు గుర్తకొస్తాయి. కానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐఎం అహ్మదాబాద్ (IIM Ahmedabad)‌లో మాత్రం స్టాటిస్టిక్స్ క్లాస్ చాలా డిఫరెంట్‌గా సాగింది. ఓ ప్రొఫెసర్ క్లిష్టమైన స్టాటిస్టిక్స్ పాఠాన్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడానికి బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా సీన్‌ను ఉపయోగించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ భటోలియా’ (Dhurandhar Bhatolia) కామెడీ సీన్‌ను సదరు ప్రొఫెసర్ క్లాస్‌రూమ్ ప్రొజెక్టర్‌పై ప్లే చేశారు. ఆ సీన్‌లోని క్యారెక్టర్ ప్రవర్తన, అక్కడ జరిగే సిట్యుయేషన్‌ను ఉదాహరణగా తీసుకుని ‘స్టాటిస్టికల్ మోడల్స్, డేటా అనాలిసిస్’ పాఠాలను విద్యార్థులకు వివరించారు. అయితే, సరికొత్తగా, కామెడీగా సాగిన ఈ టీచింగ్ స్టైల్‌కు విద్యార్థులు ఫిదా అయిపోయారు. క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్ పాఠం చెప్తుండగా తీసిన ఈ చిన్న వీడియో క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో చేరడంతో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియో చూసిన కొందరు నెజిజన్లు ‘మా కాలేజీల్లో కూడా ఇలాంటి ప్రొఫెసర్లు ఉంటే ఎంత బాగుండేదో’ అని కొందరు.. ‘క్రియేటివిటీ అంటే ఇదే.. కష్టమైన సబ్జెక్టును కూడా ఎంత ఈజీగా బుర్రకెక్కించారో’ అంటూ మరొకొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story