ఆర్యవైశ్య మహాసభలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి: కైలాస్ శ్రీనివాసరావు

by Jakkula.Mamatha |

సమాజంలో మనకు గుర్తింపు ఉన్నా.. సంఖ్యాపరంగా వెనుకబడి ఉన్నామని.. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు.

ఆర్యవైశ్య మహాసభలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలి: కైలాస్ శ్రీనివాసరావు
X

దిశ, భిక్కనూరు: సమాజంలో మనకు గుర్తింపు ఉన్నా.. సంఖ్యాపరంగా వెనుకబడి ఉన్నామని.. ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం నాడు ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన గ జవాడ నాగరాజు(విలేఖరి)కు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మీడియా కమిటీ వైస్ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నామని, అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే మన సంఖ్యా బలం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అందుకే వారం పది రోజుల్లో సభ్యత్వ స్వీకరణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా సభ్యత్వం స్వీకరించాలని సూచించారు. రాజకీయంగా ఎదిగితేనే మనకంటూ గుర్తింపు లభిస్తుందని వివరించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, తెలంగాణ రీజినల్ చైర్మన్ శెనిశెట్టి గౌరీశంకర్‌లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం ప్రధాన కార్యదర్శి చల్ల లక్ష్మణ్, కోశాధికారి కొడిప్యాక వెంకటేశం, ఉపాధ్యక్షులు శె ని శెట్టి శ్రీనివాస్, అతిమాముల రమేష్ గుప్తా, శ్రీరామ్ వెంకటేష్, గంగెల్లి మధుసూదన్, పబ్బ నాగరాజు, గూడెపు సిద్ధగిరి, గంజి శ్రీనివాస్, బొందుగుల రవీందర్, ధన్నారపు శ్రీరామ్, గం గెల్లి శివకుమార్, కొడిప్యాక అంజయ్య, చీకోటి నాగభూషణం, అల్లాడి రమేష్, ధన్నారపు రామకృష్ణ, ధన్నారపు శ్రీనివాస్, గంగెల్లి జగదీశ్వర్, బొందుగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story