- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రద్ధా కపూర్ ‘ఈథా’ టీజర్ లీక్.. సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఆ సీన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న తాజా బయోపిక్ చిత్రం 'ఈథా' (Eetha) టీజర్ నెట్టింట లీక్ అయి సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్న తాజా బయోపిక్ చిత్రం 'ఈథా' (Eetha) టీజర్ నెట్టింట లీక్ అయి సంచలనం సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన ఒక సినిమా స్క్రీనింగ్ సందర్భంగా ఈ టీజర్‌ను ప్రదర్శించగా.. కొందరు ప్రేక్షకులు దానిని మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ లీక్‌డ్ టీజర్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, శ్రద్ధా కపూర్ నటనపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ జానపద కళాకారిణి, లావణి నృత్య సామ్రాజ్ఞి 'విఠాబాయి భౌ మాంగ్ నారాయణగాంకర్' జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లీకైన టీజర్‌లో శ్రద్ధా కపూర్ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తొమ్మిది నెలల గర్భవతిగా ఉండి, ప్రసవ వేదన వస్తున్నప్పటికీ.. స్టేజ్ వెనుక బిడ్డకు జన్మనిచ్చి. మరుక్షణమే మళ్లీ స్టేజిపైకి వచ్చి నృత్యం చేసే భావోద్వేగభరితమైన సీన్‌ను ఈ టీజర్ చూపించారు. సాంప్రదాయ నౌవారి శైలి చీరకట్టులో శ్రద్ధా కపూర్ లుక్, హావభావాలు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
'స్త్రీ' రేంజ్ హిట్ ఖాయమా..?
గతేడాది 'స్త్రీ-2' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ధా కపూర్.. 'ఈథా' చిత్రంతో మరోసారి బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. టీజర్ చూసిన అభిమానులు "స్త్రీ ఈజ్ బ్యాక్" అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్ కెరీర్లోనే ఇది అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ (మాడాక్ ఫిల్మ్సస్) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రణదీప్ హుడా, మహ్మద్ జీషన్ అయూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.






