'నాగబంధం' తమిళనాడు హక్కులు సొంతం చేసుకున్న క్రేజీ నిర్మాణ సంస్థ

by Pulgam srinivas |

నాగబంధం మూవీ తమిళనాడు హక్కులను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది.

నాగబంధం తమిళనాడు హక్కులు సొంతం చేసుకున్న క్రేజీ నిర్మాణ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్". ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు మరియు ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తమిళనాడు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తమిళనాడులో కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మంచి పంపిణీ నెట్‌వర్క్ ఉండటంతో, ఆ ప్రాంతంలో ఈ చిత్రానికి ఎక్కువ సంఖ్యలో థియేటర్లు లభించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాహసాలతో కూడిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.j

Next Story