ఆ అడ్మిట్ కార్డులు చెల్ల‌వు.. నీట్ యూజీ రీఎగ్జామ్‌పై ఎన్టీఏ క్లారిటీ

by Ajay Maddhiboyina |

నీట్ యూజీ రీ ఎగ్జామ్ కోసం కొత్త అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నవాళ్లు మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. డౌన్ లోడ్ చేసుకోనివారికే సందేశాలు పంపుతున్నట్టు స్పష్టం చేసింది.

ఆ అడ్మిట్ కార్డులు చెల్ల‌వు.. నీట్ యూజీ రీఎగ్జామ్‌పై ఎన్టీఏ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: నీట్ యూజీ రీ ఎగ్జామ్ కోసం కొత్త అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకున్నవాళ్లు మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. డౌన్ లోడ్ చేసుకోనివారికే సందేశాలు పంపుతున్నట్టు స్పష్టం చేసింది. మే 3వ తేదీన జారీ చేసిన అడ్మిట్ కార్డులు ఈ పరీక్షకు చెల్లుబాటుకావని, కొందరికి వారి ప్రాధాన్యత నగరాల్లో కొత్త పరీక్ష కేంద్రాలు కేటాయించినందుకు తాజా అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా తాము ముందుగా ప్రకటించినట్టే ఈనెల 21న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. పరీక్ష వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పింది. విద్యార్థులు పరీక్ష రాయడంపైనే దృష్టి పెట్టాల‌ని తెలిపింది. అంతేకాకుండా విద్యార్థులు ఎవ‌రైనా మాన‌సిక ఒత్తిడితో బాధ‌ప‌డుతుంటే మాన‌స్ మెంట‌ల్ హెల్త్ హెల్ప్ లైన్ 14416కు ఫోన్ చేసి సాయం పొందాల‌ని పేర్కొంది.

Next Story