- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET (UG) అభ్యర్థులకు బిగ్ అలర్ట్: డ్రెస్ కోడ్, కండీషన్లపై NTA మార్గదర్శకాలు జారీ
నీట్ యూజీ (NEET-UG) రీ ఎగ్జామ్‌కు అటెండ్ కాబోయే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక డ్రెస్ కోడ్, మార్గదర్శకాలను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ యూజీ (NEET-UG) రీ ఎగ్జామ్‌కు సంబంధించి పరీక్షల నిర్వహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (NTA) విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే వస్తువులు, అభ్యర్థులు పాటించాల్సిన డ్రెస్ కోడ్‌పై ఇవాళ కీలక అడ్వైజరీ విడుదల చేసింది. అయితే, పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకు వీలుగా ఎన్‌టీఏ ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
NTA డ్రెస్ కోడ్, నిబంధనలు ఇవే..
అభ్యర్థులు సాధారణ, లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది. పెద్ద పెద్ద బటన్లు, ఎంబ్రాయిడరీ, పాకెట్స్ ఎక్కువగా ఉన్న దుస్తులకు అనుమతి లేదని తెలిపారు. అలాగే ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు కాకుండా హాఫ్ స్లీవ్స్ దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రానికి షూస్ వేసుకుని రాకూడదు. కేవలం తక్కువ హీల్స్ ఉన్న శాండల్స్, స్లిప్పర్స్ మాత్రమే అనుమతిస్తారు. పరీక్షా హాలులోకి అడ్మిట్ కార్డ్, ప్రభుత్వం ఇష్యూ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లతో పాటు ట్రాన్‌స్పరెంట్ వాటర్ బాటిళ్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ డివైజ్‌లు, స్మార్ట్ వాచీలు, క్యాలిక్యులేటర్లు, పర్సులు, బెల్టులు, ఎలాంటి బంగారు, వెండి ఆభరణాలను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే పరీక్ష రాయడానికి అనుమతించేది లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకునే ముందే డ్రెస్ కోడ్, కండిషన్లను అన్నింటినీ సరిచూసుకోవాలని సూచించింది.






