- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ సందర్శించిన కలెక్టర్ భవేష్ మిశ్రా
దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు.

దిశ, దిలావర్పూర్ : దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల లో వసతి, విద్యా బోధన ,పారిశుద్ధ్యం, సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థినిలతో నేరుగా మాట్లాడి పారిశుద్ధ్యం విద్యా బోధన తిరును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ.. విద్యార్థుల తల్లిదండ్రులు మనపై నమ్మకం తో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారని వారు నమ్మినట్టుగానే ఉత్తమ విద్యను అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులను కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందువలన ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో భోజన్న, తహసీల్దార్ అజిజ్ అహ్మద్ ఖాన్,ఎంఈఓ సదానందం,పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు అపర్ణ నాయకులు పి అనిల్ తదితరులు పాల్గొన్నారు.






