ఒంగోలులో కదంతొక్కిన పొగాకు రైతులు.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 10:38:39  IST  )

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొగాకు రైతులు ఒక్కసారిగా కదంతొక్కారు. వందలాది ట్రాక్టర్లతో రోడ్డెక్కారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిరసన వ్యక్తం చేశారు..

ఒంగోలులో కదంతొక్కిన పొగాకు రైతులు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొగాకు రైతులు(Tobacco Farmers) ఒక్కసారిగా కదంతొక్కారు. వందలాది ట్రాక్టర్లతో రోడ్డెక్కారు. గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలు మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. తమ నుంచి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు రూ. 1000 కోట్లు కేటాయించాలని కోరారు.

గిట్టుబాటు ధర లేక ..

కాగా ఈ ఏడాది దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లేక జిల్లాకు చెందని పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు పంట తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ డబ్బులు కనీసం కూలీ, ట్రాన్స్ పోర్టు ఖర్చులకు కూడా సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు సైతం చెప్పామని తెలిపారు. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తామంతా నిరసన వ్యక్తం చేశామని, ఇప్పటికే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని పొగాకు రైతులు విజ్ఞప్తి చేశారు.

Next Story