భూ కబ్జా కేసులో బెయిల్.. బొల్లా బ్రహ్మనాయుడికి ఊరట

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-19 09:27:08  IST  )

వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ గండిపేట భూ కబ్జా కేసులో ఆయనకు ఊరట లభించింది....

భూ కబ్జా కేసులో బెయిల్.. బొల్లా బ్రహ్మనాయుడికి ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి(Former Vinukonda YCP MLA Bolla Brahma Naidu)కి బెయిల్ మంజూరు అయింది. హైదరాబాద్ గండిపేట భూ కబ్జా కేసులో ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపున రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అయితే కొన్ని షరతులు విధించింది. రూ. 20 వేలతో పాటు ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, అలాగే 15 రోజులకోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది.

మూడు రోజుల కస్టడీలో కీలక ప్రశ్నలు

కాగా హైదరాబాద్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రయత్నించారని, అంతేకాదు నకిలీ డాక్యుమెంట్లూ సృష్టించారని ఆయనపై కేసు నమోదు అయింది. స్థానిక ఎమ్మార్వో ఫిర్యాదుపై ఉప్పరపల్లి పోలీసులు చర్యలు తీసుకున్నారు. తమిళనాడు పారిపోయిన బ్రహ్మనాయుడితో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రిమాండ్‌లో ఉండగానే కోర్టు అనుమతితో నిందితులను మూడు రోజులు పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. గండిపేట సర్వే నెంబర్ 18లో ఉన్న 9.28 ఎకరాల భూమికి సంబంధించిన ప్రశ్నలు సంధించారు. భూ కబ్జాకు సంబంధించిన లావాదేవీలపైనా పోలీసులు ప్రశ్నించారు.

తనకేమీ తెలియదని ఆన్సర్

అయితే పోలీసుల ప్రశ్నలకు నిందితులు తమకేమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. మూడు రోజుల కస్టడీకి ముగిసిన తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టి మళ్లీ జైలుకు తరలించారు. దీంతో తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టుతూ బొల్లా బ్రహ్మనాయుడి తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిగింది.

Next Story