- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్దవూర- నాగార్జునసాగర్ రహదారిపై రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజి ముత్యాలమ్మ గుడి వద్ద రాత్రి జరిగింది.

దిశ,పెద్దవూర: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజి ముత్యాలమ్మ గుడి వద్ద రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం.. నిన్న రాత్రి 10 గంటల సమయంలో పెద్దవూర సాగర్ మధ్యలో గల రామన్నగూడెం స్టేజి ముత్యాలమ్మ గుడి సమీపంలో హైదరాబాద్ నుంచి సాగర్ వస్తున్న షిఫ్ట్ కారుకి, సాగర్ నుంచి పెద్దవూర సైడ్ వెళుతున్న మారుతి ఎక్సెల్ సిక్స్ కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు తంసయ్య(60),ప్రకాష్ రావు(40), మరియు సాగర్ నుంచి వస్తున్న కారులో ఉన్న సాయి కుమార్(26) అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని సాగర్ కమల నెహ్రూ హాస్పిటల్‌కి పంపించి వారి బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమైనదని ఎస్సై గోపాలరావు తెలిపారు.






