నిబంధనల వల్ల పాతకాలపు పద్ధతిగా మారింది.. పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ రోజుల్లో జెన్-జీ యువత పెళ్లిని ఒక పాతకాలపు పద్ధతిగా భావిస్తోంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. సమాజం పెళ్లి విషయంలో కొన్ని కఠినమైన నియమాలను తయారు చేసింది.

నిబంధనల వల్ల పాతకాలపు పద్ధతిగా మారింది.. పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల రౌడీ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్నారు. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఫిబ్రవరిలో నెలలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత సినీ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ జంట.. కలిసి నటిస్తున్న సినిమా ‘రణబాలి’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీతో పాటు భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ లోనూ రష్మిక నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లి, సమాజంలోని కట్టుబాట్లపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పెళ్లి అనే బంధం గురించి రష్మిక మాట్లాడుతూ.. "వివాహం అనేది సమాజం పెట్టిన నిబంధనలు, కఠినమైన రూల్స్‌కు తగ్గట్టుగా మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు.

కేవలం సొసైటీ కోసం పెళ్లి చేసుకోకూడదు. ఆ బంధంలో ఉండే ఇద్దరు పార్ట్‌నర్స్ ఏం కోరుకుంటున్నారు, వారు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేదే ముఖ్యం. వారి సంతోషమే ఫైనల్" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అలాగే ప్రస్తుత తరం ఆలోచనల గురించి చెప్తూ.. "ఈ రోజుల్లో జెన్-జీ యువత పెళ్లిని ఒక పాతకాలపు పద్ధతిగా భావిస్తోంది. దానికి ఒక బలమైన కారణం ఉంది. సమాజం పెళ్లి విషయంలో కొన్ని కఠినమైన నియమాలను తయారు చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఒక వయసు రాగానే ఖచ్చితంగా పెళ్లి జరిగిపోవాలని, అది తప్పనిసరి అని కండిషన్స్ పెట్టి ఒత్తిడి తేస్తుంది. ఇలాంటి ఒత్తిళ్ల వల్లే నేటి తరం యువత పెళ్లి అనే వ్యవస్థకు కాస్త దూరంగా ఉండాలని ఆలోచిస్తోంది" అని రష్మిక చెప్పుకొచ్చారు. రష్మిక చేసిన ఈ కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story