2029 లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి

by velandi.Saikiran |

ధర్మపురిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జ‌రిగాయి.

2029 లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి
X

దిశ, ధర్మపురి: దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాహుల్ గాంధీది అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మపురిలోని నంది చౌరస్తాలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ... దేశ సమైఖ్యత సమగ్రత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని మంత్రి అడ్లూరి అన్నారు.

దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ కి ఆ ఛాన్స్ ఇచ్చార‌న్నారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిగా చూడాలని ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ , తిరుపతి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story