- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షెడ్యూల్ ప్రకారమే నీట్ రీ ఎగ్జామ్: పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకణ
జూన్ 21న జరగబోయే నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు ముందు దాఖలైన అత్యవసర పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET-UG) పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న జరగబోయే ‘నీట్’ రీ ఎగ్జామ్‌కు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో.. పరీక్షకు సంబంధించిన పలు పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. అయితే, జూన్ 21న జరగనున్న రీ-టెస్ట్‌ను నిలిపివేయాలని, వాయిదా వేయాలని కోరుతూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే, పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున, ఈ దశలో పరీక్ష ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని పిటిషన్లు ఇప్పటికే జస్టిస్ పి.ఎస్.నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందుకు లిస్ట్ అయి ఉన్నాయని, కాబట్టి ఈ కొత్త పిటిషన్లను కూడా ఆ బెంచే పరిశీలిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి అన్ని పిటిషన్లను ఇప్పటికే నిర్ణయించిన తదుపరి విచారణ తేదీల్లోనే క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అంతకంటే ముందే అత్యవసరంగా విచారణ చేపట్టే ప్రసక్తే లేదని ధర్మసనం తెలిపింది. పరీక్షకు ముందు ఇలాంటి పిటిషన్లపై విచారణ జరపడం వల్ల విద్యార్థుల్లో మరింత గందరగోళం, ఆందోళన నెలకొనే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ధర్మాసనం తాజా నిర్ణయంతో జూన్ 21న జరగబోయే నీట్ యూజీ (NEET-UG) రీ ఎగ్జామ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా షెడ్యూల్ ప్రకారమే జరగనుంది.






