మేడిపల్లి నూతన సీఐగా జలంధర్ రెడ్డి

by Jakkula.Mamatha |

మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జలంధర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.

మేడిపల్లి నూతన సీఐగా జలంధర్ రెడ్డి
X

దిశ,మేడిపల్లి: మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జలంధర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు విధులు నిర్వహించిన చింత శంకరయ్య హిమాయత్ నగర్ పీఎస్‌కు బదిలీపై వెళ్ళారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసింగ్ నిర్వహిస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

Next Story