- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు గూస్‌బంప్స్ వస్తున్నాయి.. ‘బాలన్: ది బాయ్’ కి నాగచైతన్య రివ్యూ
ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ‘బాలన్: ది బాయ్’ అంతలా నన్ను కదిలించేసింది.

దిశ, సినిమా: ‘మంజుమ్మేల్ బాయ్స్’ వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ క్రేజీ మూవీ ‘బాలన్ ది బాయ్’. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ అతిథి పాత్రలో నటించగా.. బాల నటుడు అదిశేషన్ కేఆర్, నటి ఫర్జానా పాలథింగల్, జీవన్ జీన్ పాల్ లాల్, గిరీష్ ఏడి ప్రధాన పాత్రలో కనిపించారు. కెవిఎన్ బ్యానర్’పై వెంకట్ నారాయణ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నేడు విడుదలై మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను రాబట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, అక్కినేని నాగచైతన్య ఈ చిత్రాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. "ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ‘బాలన్: ది బాయ్’ అంతలా నన్ను కదిలించేసింది. ఇది చాలా భావోద్వేగభరితంగా , అదే సమయంలో అంతే ఉత్కంఠభరితంగా సాగింది.
ఈ సినిమా పైకి కనిపించే కథలా ఉండదు.. ఇందులో ఊహించని ఎన్నో ఆశ్చర్యకరమైన మలుపులు ఉన్నాయి" అని చైతన్య చెప్పుకొచ్చారు. మరింతగా సినిమాలోని పాయింట్ గురించి వివరిస్తూ.. "మొదట్లో, మూవీ స్టార్ట్ అయిన మొదటి 10-15 నిమిషాలు చూస్తున్నప్పుడు, ఇది తల్లి-బిడ్డల మధ్య సాగే సెంటిమెంట్ సినిమా ఏమో అనుకున్నాను. కానీ కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఇది పూర్తిగా భిన్నమైన మలుపులు తీసుకుంది. ముగిసే సమయానికి, నాకు ఒక గొప్ప జీవిత స్ఫూర్తి అనే సందేశం లభించింది. మన జీవితంలో ఏది జరిగినా, ఎలాంటి కఠినమైన సవాళ్లు ఎదురైనా.. వాటిని అర్థం చేసుకుని, ధైర్యంగా ఎదుర్కొని, ముందుకు సాగడానికి ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుందని ఈ సినిమా నిరూపించింది. ఈ చిత్రం గురించి మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. థియేటర్లో మూవీ చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇదే అద్భుతమైన అనుభూతిని పొందుతారని నేను నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.






