కాంగ్రెస్ అధిష్టానానికి ఆర్యవైశ్యుల అల్టిమేటం.. దేవాలయ కమిటీల్లో ప్రాధాన్యత దక్కేనా?

by Jakkula.Mamatha |

ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల చైర్మన్ పదవులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానికంగా పార్టీని అంటూ పెట్టుకుని ఉన్న ఆర్యవైశ్యులకు చైర్మన్ పదవి ఇచ్చి దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు ఆర్య వైశ్యులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు.

కాంగ్రెస్ అధిష్టానానికి ఆర్యవైశ్యుల అల్టిమేటం.. దేవాలయ కమిటీల్లో ప్రాధాన్యత దక్కేనా?
X

దిశ, ఏన్కూర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పదవులను పార్టీ పదవుల్లో ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చినా? ఇవ్వకపోయినా? ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గంలో ఉన్న దేవాలయాల చైర్మన్ పదవులను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్థానికంగా పార్టీని అంటూ పెట్టుకుని ఉన్న ఆర్యవైశ్యులకు చైర్మన్ పదవి ఇచ్చి దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు ఆర్య వైశ్యులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. నామినేటెడ్ పదవులు పందేరం మొదలై నెలలు గడుస్తున్నప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క దేవాలయానికి చైర్మన్ పదవి ఆర్యవైశ్యులకు కేటాయించిన దాఖలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓట్లు వేసే దగ్గర ఆర్య వైశ్యులు ముందు ఉండి పనిచేయించుకోవడం, చందాల రూపంలో వసూలు చేసే సమయంలో ఆర్యవైశ్యులకు టార్గెట్ ఇచ్చే పార్టీ నాయకులు పదవులు ఇచ్చే సమయంలో ఆర్యవైశ్యులు ఎందుకు గుర్తురారని జిల్లాలోని పలు ఆర్యవైశ్యులు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.

గత పది సంవత్సరాల కాలం నుండి పార్టీ అధికారంలో లేని సమయంలో బయటపడి తిరగలేకపోయినా అంతర్గతంగా ఆర్యవైశ్యులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. అలాంటి ఆర్యవైశ్యుల సమాజానికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పంపకాల్లో జాప్యం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, తమ పరిధిలో ఉన్న దేవాలయాలకు, ఇతర నామినేటెడ్ పదవులకు ఆర్యవైశ్యులకు ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన సపోర్ట్ ను తెలియజేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్యులు కోరుతున్నారు. ఎంతవరకు ఆర్యవైశ్యులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి తమ మద్దతును తెలుపుతారు వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Next Story