టేకు కలపను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

by Jakkula.Mamatha |

అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.

టేకు కలపను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
X

దిశ, చర్ల: అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండలంలోని పెద్దిపల్లి రేవు మీదుగా టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని తరలించేందుకు సిద్ధంగా ఉన్న టేక్ కలపను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న కలప విలువ 1 లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.

Next Story