ఇందిరమ్మ ఇళ్ల పేరుతో టోకరా.. ‘దిశ’ కథనంతో కదలిన యంత్రాంగం

by Jakkula.Mamatha |

అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో 16వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు డబ్బులు వసూలు చేసి అమాయకురాలిని టోకరా చేసిన కథనంపై అధికారులు స్పందించారు.

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో టోకరా.. ‘దిశ’ కథనంతో కదలిన యంత్రాంగం
X

దిశ, అచ్చంపేట: అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో 16వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు డబ్బులు వసూలు చేసి అమాయకురాలిని టోకరా చేసిన కథనంపై అధికారులు స్పందించారు. ‘దిశ’ వార్తకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ మురళి, మేనేజర్ రమేష్ నాయక్, హౌసింగ్ డీ.హరి నాయకులు నామసాని శిల్ప వద్దకు వెళ్లి విచారణ చేయగా ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుందని సర్వే చేసినప్పుడు అద్దె ఇంట్లో ఉంటుందని, స్థలం లేదని చెప్పడంతో ఆ అధికారి ఎల్ 2లో చూపించాల్సి వచ్చిందని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలం వారిది అయినప్పటికీ భాగ పరిష్కారాలు చేసుకున్నారు. కానీ స్థల డాక్యుమెంట్స్ లేవని, డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకుంటే ఎల్ 2 నుంచి ఎల్ వన్‌గా మార్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి విచారణ నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తున్నామన్నారు.

Next Story