- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దౌల్తాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందా?, లేదా? తెలుసుకునేందుకు దౌల్తాబాద్ గ్రామ సర్పంచ్ ముచ్చమర్రి అనురాధ రమేష్, ఉపసర్పంచ్ ఆది బాలకృష్ణ శుక్రవారం స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ,దౌల్తాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందా?, లేదా? తెలుసుకునేందుకు దౌల్తాబాద్ గ్రామ సర్పంచ్ ముచ్చమర్రి అనురాధ రమేష్, ఉపసర్పంచ్ ఆది బాలకృష్ణ శుక్రవారం స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటలో ఉపయోగిస్తున్న పదార్థాలు, పరిశుభ్రత ప్రమాణాలు, వంటశాల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన, పోషకాహారం పొందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భోజన తయారీ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం ఎంతో కీలకమని, అందువల్ల ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని పేర్కొన్నారు.






