- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘NBK-111’ నుంచి నయనతార ఔట్.. బాలయ్యకు జోడీగా స్టార్ హీరోయిన్.. ప్రకటనతో కన్ఫర్మ్ చేసిన దర్శకుడు!
పుకార్లను నిజం చేస్తూ గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా కాజల్ నటిస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘NBK-111’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ గత కొద్ది కాలంగా ఏమైందో ఏమో కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె స్థానంలోకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ వచ్చినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈక్రమంలో.. తాజాగా, ఈ పుకార్లను నిజం చేస్తూ గోపీచంద్ మలినేని ట్విట్టర్ ద్వారా కాజల్ నటిస్తున్నట్లు ప్రకటించారు. కాజల్ పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ.. ఆమె ఇందులో భాగం అయినందుకు గానూ ధన్యవాదాలు కూడా చెప్పారు. అందరూ మెచ్చుకునే నటిగానే కాకుండా, ఆ నటి వెనుక ఉన్న మంచి మనసున్న వ్యక్తిని తెలుసుకునే అదృష్టం నాకు కలిగింది అని రాసుకొచ్చారు. అలాగే ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ చీరకట్టులో, కళ్లజోడు ధరించి అత్యంత గంభీరంగా కనిపించారు. కార్యలయ వాతావరణంలో నిలబడి ఉన్న ఆమె లుక్‌లో సీరియస్‌నెస్, పవర్‌ఫుల్ వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌ను ఇలా డీగ్లామరస్‌గా చూపించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. ఇందులోంచి నయనతార తప్పుకుండా లేక తప్పించారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ‘ భగవంత్ కేసరి’ వంటి హిట్ సినిమా తర్వాత బాలయ్య-కాజల్ కాంబోలో రాబోతున్న రెండో మూవీ కావడం విశేషం. ఇక గోపీచంద్ మలినేని సెంటిమెంట్ ఈసారి వర్కౌట్ అవుతుందా? లేదా అనేది చూడాలి.






