నిజాంపేట మండలంలో అధ్వాన్నంగా బ్రిడ్జ్‌ల పరిస్థితి!

by Jakkula.Mamatha |

గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ ఎన్‌హెచ్ 765 రోడ్డుపై ఉన్న బ్రిడ్జి పగులు ఏర్పడి, కింది భాగం కూలిపోయింది.

నిజాంపేట మండలంలో అధ్వాన్నంగా బ్రిడ్జ్‌ల పరిస్థితి!
X

దిశ, నిజాంపేట: గత ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ ఎన్‌హెచ్ 765 రోడ్డుపై ఉన్న బ్రిడ్జి పగులు ఏర్పడి, కింది భాగం కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో పక్క నుంచి ప్రత్యామ్నాయ రోడ్డు, సూచిక బోర్డులను అధికారులు ఏర్పరిచారు. ఈ రోడ్డుపై ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాయి. అలాగే నస్కల్, నిజాంపేట మధ్యలో మల్కచెరువు వద్ద గల బ్రిడ్జి వరద ఉధృతి తట్టుకోలేక పూర్తిగా కూలిపోయింది. ఈ బ్రిడ్జి కట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ నూతన బ్రిడ్జికి మరమ్మతులు నేటికీ నోచుకోవడం లేదని, గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం సైతం, ఈ ప్రాంతంలో పర్యటించిన శాశ్వత మరమ్మత్తులు నేటికీ జరగడం లేదని, విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపాలని వేడుకుంటున్నారు. ఈ వర్షాకాలం వర్షాలకు బ్రిడ్జి నిలుస్తుందని! ప్రశ్నిస్తున్నారు. నస్కల్ - నిజాంపేట మధ్యలో బ్రిడ్జి ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇప్పటికీ కొత్త బ్రిడ్జి ఈ ప్రాంతంలో నిర్మించడం లేదు. ఈ బ్రిడ్జి కింది భాగం పూర్తిగా దెబ్బతిని, గట్టితనాన్ని కోల్పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి నూతన నిర్మాణాన్ని చేపట్టాలని బక్కన్నగారి నరేష్ గౌడ్ కోరారు.

Next Story