టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ. కేంద్రం ఉత్తర్వులను సమర్థించిన ధర్మాసనం

by Kema Shiva Kumar |

నీట్ (NEET) రీ ఎగ్జామ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌పై విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.

టెలిగ్రామ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ. కేంద్రం ఉత్తర్వులను సమర్థించిన ధర్మాసనం
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ ఎగ్జామ్‌కు ముందు ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram)కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా కారణాల దృష్ట్యా టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పూర్తిగా సమర్థించదగినదిగా(Well-founded) ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

కేంద్రం నిర్ణయం సరైనదే..

జాతీయ ప్రయోజనాలు, పరీక్షల పారదర్శకతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు చట్టబద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ‘నీట్’ వంటి దేశవ్యాప్త ప్రతిష్టాత్మక పరీక్షల విశ్వసనీయతను కాపాడటం అత్యంత కీలకమని కోర్టు అభిప్రాయపడింది. ప్రశ్నాపత్రాల లీకేజీచ, పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిరోధించేందుకు సోషల్ మీడియా, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచడం ప్రభుత్వ బాధ్యత అని సమర్థించింది. పరీక్ష నిర్వహణకు ముందు శాంతిభద్రతలు, గోప్యతను కాపాడేందుకు కేంద్రం జారీ చేసిన ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని తెలుపుతూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో నీట్ రీ-టెస్ట్ ముగిసే వరకు టెలిగ్రామ్‌పై కేంద్రం విధించిన ఆంక్షలు యథాతథంగా కొనసాగునున్నాయి.

Next Story