ఏపీలో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పలాస తాల‌భ‌ద్ర మ‌ధ్య‌లోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ట్రాక్ పై స్థానికుల‌కు తెల్ల‌వారుజామున‌ మూడు మృత‌దేహాలు క‌నిపించాయి.

ఏపీలో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పలాస తాల‌భ‌ద్ర మ‌ధ్య‌లోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ట్రాక్ పై స్థానికుల‌కు తెల్ల‌వారుజామున‌ మూడు మృత‌దేహాలు క‌నిపించాయి. స‌మాచారం అందడంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు త‌ల్లి ఇద్ద‌రు బిడ్డ‌ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటుంద‌ని భావించారు. ఘ‌ట‌న‌పై రైల్వే పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈరోజే ప్ర‌కాశం జిల్లాల్లో ఓ తండ్రి త‌న ముగ్గురు కుమార్తెల‌కు విషం పెట్టి, ఆపై తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న సైతం వెలుగుచూసింది. ఆర్థిక ఇబ్బందులు, భార్య కాపురానికి రావ‌డంలేదు అనే కార‌ణాల‌తో మ‌న‌స్థాపం చెంది తండ్రి కూతుళ్ల‌తో క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు బంధువులు చెబుతున్నారు. ఇలా ఒకే రోజు రాష్ట్రంలో పిల్ల‌ల‌ను చంపి తల్లిదండ్రులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Next Story