ఒప్పందం కుదిరిన మరుసటిరోజే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి

by Ajay Maddhiboyina |

అమెరికా ఇరాన్ దేశాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన మ‌రుస‌టి రోజే మ‌రోసారి ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. లెబ‌నాన్ లోని హెజ్ బొల్లా స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్ దాడుల‌కు పాల్ప‌డింది.

ఒప్పందం కుదిరిన మరుసటిరోజే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికా ఇరాన్ దేశాల మ‌ధ్య ఒప్పందం కుదిరిన మ‌రుస‌టి రోజే మ‌రోసారి ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. లెబ‌నాన్ లోని హెజ్ బొల్లా స్థావ‌రాల‌పై ఇజ్రాయెల్ దాడుల‌కు పాల్ప‌డింది. ఈ దాడుల్లో 16 మర‌ణించారు. మెరుపు దాడుల అనంత‌రం.. ద‌క్షిణ లెబ‌నాన్ అంతా రాత్రిస‌మ‌యంలో త‌మ బ‌ల‌గాలు దాడి చేశాయ‌ని ఇజ్రాయెల్ సైన్యం ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో త‌మ దేశ పౌరులు 16 మంది మ‌ర‌ణించిన‌ట్టు లెబ‌నాన్ ప్ర‌భుత్వ ఆధీనంలోని న్యూస్ ఏజెన్సీ నివేదించింది.

ఇరాన్ యుద్ధానికి శాశ్వ‌త ముగింపు ప‌లికేందుకు స్విట్జ‌ర్లాండ్ వేదిక‌గా ఇరాన్, అమెరికా మ‌ధ్య చ‌ర్చ‌లు వాయిదా ప‌డిన త‌రుణంలో ఈ దాడులు జరిగాయి. ప్ర‌స్తుతం జ‌రిగే చ‌ర్చ‌ల‌పై దాడుల ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంది. ఇరాన్ స‌పోర్ట్ ఉన్న షియా మిలీషియా హిజ్బుల్లాపై దాడులు చేయ‌డంతో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని ఆక్ర‌మించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు గురువారం రాత్రి ఇరాన్ సుప్రీం నాయ‌కుడు అయ‌తుల్లా మొజ్త‌బా ఖ‌మేనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అమెరికాతో ప్ర‌త్య‌క్ష చ‌ర్చ‌ల‌కు ఆమెదం తెలిపారు. అయితే చ‌ర్చ‌లు అంటే శ‌త్రువు అభిప్రాయాన్ని అంగీక‌రించ‌డం కాద‌ని స్ప‌ష్టం చేవారు.

Next Story