- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం, వెండి ధరలు మళ్లీ పతనం.. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ఎఫెక్ట్‌తో దేశీయంగా బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి.

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ లవర్స్‌కు బులియన్ మార్కెట్ భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. అమెరికా (US), ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడం, ఇరు దేశాలు ఎంవోయూపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడిపై ఒత్తిడి తగ్గి ధరలు కుప్పకూలాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ.3,650 పతనమై ప్రస్తుతం రూ.1,45,860 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.3,350 తగ్గి ప్రస్తుతం రూ.1,33,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా బంగారంతో పాటే వెండి ధర కూడా డ్రాప్ అయ్యాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.15 వేల మేర తగ్గి ప్రస్తుతం రూ.2,55,000 వద్ద స్థిరపడింది.






