- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు.. స్పెషల్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభాపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో నిమగ్నమయ్యారు. ఈ మేరకు రాహుల్‌కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revath Reddy) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు. ‘మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయక నాయకుడు రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం. ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధత ఎంతోమందికి నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆయన దేశానికి, దేశ ప్రజలకు ఇలాగే తన సేవలను కొనసాగించాలని.. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషంతో, మరింత శక్తితో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.






