అలియా స్కూల్‌లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-19 05:53:31  IST  )

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అబిడ్స్ లోని చరిత్రాత్మక అలియా ప్రభుత్వ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అలియా స్కూల్‌లో విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, కార్వాన్: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అబిడ్స్ లోని చరిత్రాత్మక అలియా ప్రభుత్వ పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు పండ్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారని కొనియాడారు. విద్యార్థులంతా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని, రాహుల్ గాంధీ జీవితం అందుకు ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక పాఠశాలలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, పాఠశాల సిబ్బంది మరియు ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story