- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారి 44 పై దాబాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
తూప్రాన్ పట్టణ పరిధిలోని రహదారి-44 పై గల దాబాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, తూప్రాన్: తూప్రాన్ పట్టణ పరిధిలోని రహదారి-44 పై గల దాబాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో కొన్ని దాబాల్లో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నట్లు గుర్తించడంతో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మొత్తం 6 దాబాల నిర్వహాకుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ రహదారి 44 పై ఉన్న తెలుగు అరోమా ధాబా నిర్వహకుడు గొల్ల మాధవ్, వినోద్ ధాబా నిర్వహకుడు వినోద్ అజ్మీరా, న్యూ రెడ్డి దాబా నిర్వహకుడు అంజి రెడ్డి, శివ రెడ్డి ఫ్యామిలీ ధాబా నిర్వహకుడు రామ్ రెడ్డి, మనీషా ధాబా నిర్వహకుడు గొల్ల బాలేష్, రెడ్డి ఫ్యామిలీ దాబా నిర్వహకుడు సతీష్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. హోటళ్లు, దాబాలు మరియు ఇతర వాణిజ్య సంస్థల్లో అక్రమంగా మద్యం సేవించేందుకు అనుమతించినట్లయితే సంబంధిత నిర్వహాకులు బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ వెంకట రాజా గౌడ్ హెచ్చరించారు. ఈ తనిఖీలలో సీఐ తూప్రాన్ వెంకట రాజా గౌడ్, ఎస్‌ఐ తూప్రాన్ మరియు ఇతర ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






