- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్ డే స్పెషల్.. ‘NN-5’ సినిమా అప్డేట్‌తో క్యూరియాసిటీ పెంచేసిన నార్నె నితిన్
నేడు తన పుట్టినరోజు సందర్భంగా 5వ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘NN-5’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ క్రేజీ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో, ఎన్టీఆర్ బామర్ది నార్నె నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో హీరోగా పరిచయం అయి బ్లాక్ బస్టర్ హిటను తన ఖాతాలో వేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ‘మ్యాడ్’కు సీక్వెల్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’తో కూడా అంతే స్థాయిలో అలరించారు. అలాగే నార్నె నితిన్ చేసిన ‘ఆయ్’ కూడా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ గత ఏడాది నటించిన శ్రీ శ్రీ రాజా వారు మూవీ మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఆయన పెళ్లి చేసుకుని బ్యాచ్‌లర్‌లైఫ్‌కు గుడ్ బై చెప్పారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆయన ఫల్ జోష్‌లో ఉన్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా 5వ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘NN-5’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ క్రేజీ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో భారీ చిత్రాలను నిర్మిస్తూ, టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన పోస్టర్, దానికి నార్నె నితిన్ పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. "ఆకాశంలో ఉంటది మూన్.. నువ్వు నా జీవితానికి క్వీన్" అంటూ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ రొమాంటిక్ క్యాప్షన్‌తో, ఒక అమ్మాయికి తను లవ్ సింబల్ ఇస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. అయితే ఈ సినిమాలో నితిన్ సరసన నటించబోయే ఆ క్వీన్ ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్‌లో ఉంచారు. ఈ వినూత్నమైన పోస్టర్ నెటిజన్లను, ముఖ్యంగా లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.






