- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా?.. నాగారం గ్రామస్తుల ఆవేదన
విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు పోయే వరకు పట్టించుకునే నాథుడే లేడా?

దిశ, వలిగొండ: విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు పోయే వరకు పట్టించుకునే నాథుడే లేడా? అనే రీతిలో వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో ఒక వార్డులో గ్రామానికి మంచినీరు అందించే బోరు మోటర్ యొక్క స్టార్టర్ కొద్ది రోజులుగా డబ్బా విరిగి రోడ్డుపై పడిన పట్టించుకునే నాథుడే లేడు. ఎన్నికల సమయంలో వార్డులో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తానని ఓటర్లను నమ్మబలికి నమ్మించి గెలుపొందిన కొద్ది రోజులకే ఇచ్చిన హామీలను మరిచిపోయి ఏదేచ్ఛగా తిరుగుతున్నారు.
ప్రస్తుతం వానాకాలం సీజన్ కావడంతో వర్షం కురిసినప్పుడు విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉన్నందున కనీసం గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినా పట్టించుకోకుండా వ్యవహరించడం ఏమిటని వార్డులోని సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని వార్డుల్లో సంచరించి గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఈ బోరు మోటార్ యొక్క స్టార్టర్‌ను తొలగించి భద్రపరచాలని వార్డులోని సభ్యులు కోరుతున్నారు.






