భద్రాద్రి కొత్తగూడెం బాలింత మృతి కేసులో ట్విస్ట్.. చితాబ‌స్మంలో దొరికిన కత్తెర

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-19 05:09:44  IST  )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవ‌ల‌ ప్రసవ సమయంలో వైద్యం తల్లి, బిడ్డ ఇద్దరూ మరణించారు. జిల్లాలోకి గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ అనే గర్భిణికి ఈనెల 13న పురిటినొప్పులు వచ్చాయి.

భద్రాద్రి కొత్తగూడెం బాలింత మృతి కేసులో ట్విస్ట్.. చితాబ‌స్మంలో దొరికిన కత్తెర
X

దిశ, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవ‌ల‌ ప్రసవ సమయంలో వైద్యం తల్లి, బిడ్డ ఇద్దరూ మరణించారు. జిల్లాలోకి గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన చాట్ల వనజ అనే గర్భిణికి ఈనెల 13న పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్సు మహిళకు డెలివరీ చేయగా అనుమానాస్పదంగా తల్లి, బిడ్డ మరణించారు. డెలివ‌రీ స‌మ‌యంలో తీవ్రర‌క్త‌స్రావం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు అక్క‌డ నుండి ఇల్లెందు ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు శిశువు అప్ప‌టికే మ‌ర‌ణించింద‌ని నిర్దారించి, త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. ఖ‌మ్మం ప్ర‌భుత్వాస్ప‌త్రికి తీసుకువెళ్లాల‌ని సూచించారు.

దీంతో కుటుంబ స‌భ్యులు ఖ‌మ్మం తీసుకువెళుతుండ‌గా మార్గమ‌ధ్య‌లోనే బాలింత సైతం మ‌ర‌ణించింది. అయితే కుటుంబ సభ్యులు బాలింత అంత్యక్రియలను నిర్వహించగా చితాభస్మంలో కత్తెర కనిపించడం కలకలం సృష్టించింది. మ‌ర‌ణించిన రోజే వ‌నజ‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌గా గురువారం ద‌హ‌నం చేసిన చోట చితాభ‌స్మాన్ని సేక‌రిస్తున్న స‌మ‌యంలో ఆప‌రేష‌న్ కు ఉప‌యోగించే క‌త్తెర బ‌య‌ట‌ప‌డింది. దీంతో కుటుంబ స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వైద్యుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా తల్లీ బిడ్డ మ‌ర‌ణించార‌ని చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శనం అని అంటున్నారు. మ‌రోవైపు వైద్యాధికారులు మాత్రం బాలింత‌కు ఎలాంటి శ‌స్త్ర చికిత్స చేయ‌లేదని, నార్మ‌ల్ డెలివ‌రీ చేశామ‌ని చెబుతున్నారు. దీంతో ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని మృతురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story