- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ఆవరణలో షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి
పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించే షెడ్డుకు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు.

దిశ, మక్తల్: పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఆవరణలో రూ.36 లక్షల వ్యవయంతో నిర్మించే షెడ్డుకు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు. షెడ్డు నిర్మాణానికి ప్రస్తుతం మంజూరైన నిధులు కొరత ఏర్పడితే అదనంగా నిధులు మంజూరు చేస్తామని అన్నట్టు సమాచారం. నియమనిష్ఠలతో అయ్యప్ప మాల వేసి దీక్ష తీసుకునే స్వాములకు మౌలిక సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని ఇటీవల జరిగిన మహా పడిపూజ కార్యక్రమం సందర్భంగా అయ్యప్ప స్వాములు తన దృష్టికి తీసుకురాగా నిధులు మంజూరు చేసి నేడు భూమి పూజతో నిర్మాణ పనులు మొదలైంది. శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వరకు షెడ్డు నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
మక్తల్ పట్టణంలో గత 60 సంవత్సరాలుగా శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష మాల వేయడం జరుగిందని గుర్తుచేశారు. ఇక్కడి గురు స్వామితో మాల వేసుకుని దీక్ష కొనసాగించేందుకు ప్రాముఖ్యత ఇస్తారని. 12 సంవత్సరాల కిందట విరాళంగా నిధులు సేకరించి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించారు. రోజురోజుకు అయ్యప్ప మాలధారణ తీసుకునే భక్తుల సంఖ్య పెరగడంతో మౌలిక వసతులకు ఇబ్బంది ఏర్పడుతున్నాయని మహా పూజ కార్యక్ర మాని హాజరైనప్పుడు అయ్యప్ప స్వాములు తమ దృష్టికి తీసుకువచ్చారని వసతుల కొరత ఉందని చెప్పడంతో నిధులు మంజూరు తో నేటి భూమి పూజతో త్వరగా షెడ్డు నిర్మాణం పూర్తి చేసి మహా పూజ వరకు సిద్ధం చేయాలని కమిటీ సభ్యులను నిర్వాకులను మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ గురు స్వామి,అనిల్. గణేష్. నీలా గౌడ్. కట్ట సురేష్ పలువురు అయ్యప్ప స్వాములు, మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.






