ఖాళీ కుర్చీలతో వెలవెలబోయిన సెస్ ఐక్యవేదిక.. కారణం ఇదేనా!?

by Jakkula.Mamatha |

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సదస్సును గురువారం నిర్వహించారు.

ఖాళీ కుర్చీలతో వెలవెలబోయిన సెస్ ఐక్యవేదిక.. కారణం ఇదేనా!?
X

దిశ, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సదస్సును గురువారం నిర్వహించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాలకు చెందిన వినియోగదారులు వందల సంఖ్యలో రావాల్సి ఉంది. కానీ.. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. పదుల సంఖ్యలో మాత్రమే హాజరయ్యారు. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వినియోగదారుల సమీకరణలో అధికారుల తీరుపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గంభీరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారమై కృషి చేస్తున్నట్లు ఫోరం చైర్మన్ జె ఆర్ చవాన్ జయవంత్ తెలిపారు.

కరెంటు సమస్యల పరిష్కారం కోసం, సదస్సు నిర్వహించగా 22 వినతులు వచ్చాయని వాటితో పాటు ఇతర సమస్యలు కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా లూస్ లైన్స్ మరియు రైతులకు కొత్త సర్వీస్ కనెక్షన్ కొరకు విద్యుత్ నియంత్రికలు, హోల్స్ అవసరం ఉన్నాయని రైతులు కోరారు. పదిర మరియు గొల్లపల్లి గ్రామాలలో నూతన సబ్‌స్టేషన్లలో మంజూరు చేయించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ మెంబర్ సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఇ టి.వేణుమాధవ్, డీఈఎన్ అంజయ్య, ఏవో అరవింద్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు రాకేష్ రెడ్డి, విష్ణు, రమేష్, ఆనంద్ పలువురు సర్పంచులు, రైతులు, విద్యుత్ వినియోగదారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story