- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడుస్తున్న బైక్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం
నడుస్తున్న బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ పల్సర్ బైక్ నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయింది.

దిశ,వెల్దండ: నడుస్తున్న బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ పల్సర్ బైక్ నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందయపల్లికి చెందిన కంబాలపల్లి సాయి గురువారం మండల పరిధిలోని పెద్దాపూర్‌లో ఓ కార్యక్రమానికి వచ్చారు. శుక్రవారం ఉదయం పెద్దాపూర్ నుంచి గోవిందయపల్లికి తిరిగి వెళ్తుండగా శివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసుకొని రోడ్డు ఎక్కగానే బైక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోగా.. బైకర్ అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా బైకులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.






