- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు
by Jakkula.Mamatha |
మండలంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని చిత్తాపురం, టేకులసోమారం గ్రామాల పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

X
దిశ,వలిగొండ: మండలంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని చిత్తాపురం, టేకులసోమారం గ్రామాల పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిత్తాపురం గ్రామ శివారులోని రైస్ మిల్లు సమీపంలో తొర్రూరు నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న కారును వలిగొండ నుండి తొర్రూరు వైపు వెళుతున్న డీసీఎం వాహనం ఢీకొట్టడంతో భార్గవ్, యాకూబ్‌లకు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. టేకుల సోమారం గ్రామ సమీపంలో రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో మచ్చ ముత్యాలు, సత్తమ్మ, రాంచంద్రు, కోటమ్మకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు.
Next Story






