ధనుష్ ‘OM’ లో పవర్ ఫుల్ పాత్రలో మెగాస్టార్.. దర్శకుడి కామెంట్స్‌తో భారీ హైప్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-19 04:31:31  IST  )

మమ్ముట్టి ఇందులో 'కార్తికేయన్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కల్పిత పాత్రను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశాము.

ధనుష్ ‘OM’ లో పవర్ ఫుల్ పాత్రలో మెగాస్టార్.. దర్శకుడి కామెంట్స్‌తో భారీ హైప్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు పవర్‌ఫుల్ కథలతో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతూనే.. నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ D-55 చిత్రం ‘OM’. రీసెంట్‌గా ‘అమరన్’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో ధనుష్ సరసన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, స్టార్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ రాజ్ కుమార్.. మమ్ముట్టి గారిని ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా తీసుకువచ్చారు, సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "ఈ సినిమా కథను మమ్ముట్టి గారికి వినిపించడం కోసం నేను దాదాపు 7 నెలల పాటు నిరంతరం సంప్రదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కలవడం కుదరలేదు.

అయితే, ఒకరోజు ఆయన వ్యక్తిగత పనిమీద చెన్నైకి వచ్చినప్పుడు, నన్ను కలిసి కథ చెప్పాల్సిందిగా ఆహ్వానించారు. నేను ఆయనను కలిసి కథ వివరించడం ప్రారంభించాను. కథ వింటున్నప్పుడు ఆయనకు కొన్ని సందేహాలు వచ్చాయి, వాటినన్నింటికీ నేను పూర్తి స్పష్టతతో సమాధానాలు ఇచ్చాను. అలా సుమారు రెండు గంటల పాటు సాగిన నరేషన్ ముగియగానే.. కథ బాగా నచ్చడంతో ఆయన వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు" అని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర గురించి చెప్తూ.. "ఆయన ఇందులో 'కార్తికేయన్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కల్పిత పాత్రను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశాము. ధనుష్, మమ్ముట్టి గారి మధ్య వచ్చే సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి" అని తెలిపారు. అంతేకాకుండా, త్వరలోనే మమ్ముట్టి పాత్రకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Next Story