- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2వేల కోట్లతో అభివృద్ధి సరే.. చీపుర్ల సంగతేంటి?
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉన్నాయి. 800 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో 48 డివిజన్లు ఉన్నాయి. 800 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 336 మంది కార్మికులు విధులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు. అందులో రోడ్లు వీధులు శుభ్రం చేయడానికి ఒక్కొక్క డివిజన్‌కు సుమారు ఏడుగురు శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. కొన్ని వార్డుల్లో విస్తీర్ణం బట్టి ఎక్కువ మంది కార్మికులను కూడా నియమించారు. రోడ్లు వీధులు శుభ్రం చేయడానికి ఒక్కొక్క కార్మికురాలికి నెలకు 6 నుంచి 7 చీపుర్లు అవసరం ఉంటాయి. ఈ లెక్కన దాదాపు 49 చీపుర్లు ఒక్క నెలకు అవసరం ఉంటాయి. అంటే నగరంలో 48 డివిజన్‌లలో సుమారు 336 మంది కార్మికులు విధులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు. వాళ్లందరికీ సుమారు చీపుర్లు 2352 అవసరం. కానీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటరీ విభాగాల్లో పని చేసే కార్మికులకు అందివ్వాల్సిన వస్తువులు, పరికరాలు కూడా నెలల తరబడి ఇవ్వలేదంటే పట్టణ పరిశుభ్రత పై ఎంత శ్రద్ధ ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.
దిశ,నల్లగొండ బ్యూరో: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచేలా కృషి చేస్తున్నాం.. దానికోసం సుమారు రెండు వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి సుందరమైన నగరంగా నిర్మించేందుకు అహోరాత్రులు కష్టపడుతున్నాం.. ఇలాంటి ప్రకటనలకు నిత్యం అధికార పార్టీ నేతలు, అధికారులు కర్ణభేరీలు పగిలేలా డంకా భజాయించి నగరంలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటరీ విభాగాల్లో పని చేసే కార్మికులకు అందివ్వాల్సిన వస్తువులు, పరికరాలు కూడా నెలల తరబడి ఇవ్వలేదంటే పట్టణ పరిశుభ్రత పై ఎంత శ్రద్ధ ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో..
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో సుమారు 800 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లలో రోడ్లు, మురికి కాలువలు, చెత్త సేకరణ ఇతర పనులు నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ విస్తీర్ణాన్ని బట్టి వార్డు పరిశుభ్రత కోసం శానిటేషన్ కార్మికులను సుమారు 5 నుంచి 7గురిని కేటాయించి వార్డుల్లో రోడ్లు పరిసర ప్రాంతాలు శుభ్రం చేయిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి ట్రాక్టర్ కు డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు లేదా నలుగురు చెత్త సేకరణ చేస్తుండగా, ఓపెన్ డ్రైనేజీలు ఉన్నచోట మురికి కాలువల శుభ్రం కూడా చేస్తున్నారు. శానిటేషన్ చేసే కార్మికులకు చీపుర్లు, సబ్బులు, రెండు జతల బట్టలు, చిన్న కొడవలి, గ్లౌజులు తదితర వాటిని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందజేస్తారు.
8 నెలలుగా అందని చీపుర్లు..
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 48 డివిజన్లు ఉన్నాయి. అందులో రోడ్లు వీధులు శుభ్రం చేయడానికి ఒక్కొక్క డివిజన్ కు సుమారు ఏడుగురు శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. కొన్ని వార్డుల్లో విస్తీర్ణం బట్టి ఎక్కువ మంది కార్మికులను కూడా నియమించారు. రోడ్లు వీధులు శుభ్రం చేయడానికి ఒక్కొక్క కార్మికురాలికి నెలకు 6 నుంచి 7 చీపుర్లు అవసరం ఉంటాయి. ఈ లెక్కన దాదాపు 49 చీపుర్లు ఒక్క నెలకు అవసరం ఉంటాయి. అంటే నగరంలో 48 డివిజన్ లలో సుమారు 336 మంది కార్మికులు విధులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు. వాళ్లందరికీ సుమారు చీపుర్లు 2352 అవసరం. ఆ మేరకు కార్పొరేషన్ నుంచి సరఫరా చేయాలి.
కానీ మున్సిపల్ అధికారులు కార్మికులకు చీపుర్లు సరఫరా చేయకపోవడంతో వాళ్లు సొంత డబ్బులతో ఒక్కొక్క చీపురు కు సొంత డబ్బులు పెట్టి చేసి కొనుగోలు చేసి వీధులు రోడ్లు శుభ్రం చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్క నెలకు దాదాపు 2352 చీపుర్లు అవసరం ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయాలంటే రూ. 40 ఖర్చు అవుతుంది. అంటే ఒక్క నెలకు కార్మికులు రూ. 94,080 సొంత డబ్బులు వెచ్చించి చీపుర్లు కొనుగోలు చేసి నగరాన్ని శుభ్రపరుస్తున్నారు. అంటే ఎనిమిది నెలలుగా పట్టణ శుభ్రత కోసం శానిటేషన్ కార్మికులు దాదాపు రూ. 7, 52,640 సొంత డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చేతులకు గ్లౌజులు లేవు.. మాస్క్ లు కూడా సరిగా లేవు. దీంతో కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
చీపుర్లు అడిగితే బెదిరింపులు..
"సార్.. చీపుర్లు లేక ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇప్పించండి" అంటూ ఎవరైనా కార్మికులు జవాన్లను అధికారులను అడిగితే వాళ్లపై మానసిక వేధింపులు చెప్పుకోలేని స్థాయికి చేరుకుంటున్నాయి. ఏదైనా అడిగితే బండ బూతులు తిట్టే పరిస్థితి ఉంది. ప్రశ్నించినందుకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజంతా గైర్హాజర్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే కార్మికులు ఎవరు కూడా వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పారు.. చెబితే ఉద్యోగం తీసేస్తామని కూడా బెదిరిస్తున్నారని సమాచారం.
మున్సిపల్ కార్మికులకు చీపుర్ల సప్లై పై విచారణ చేస్తా: శరత్ చంద్ర(నగర మున్సిపల్ కమిషనర్ నల్లగొండ)
నగర పరిశుభ్రత కోసం శానిటేషన్ కార్మికులకు చీపుర్లు ఇతర సామగ్రి మున్సిపాలిటీ అందజేస్తామని నగర మున్సిపల్ కమిషనర్ నల్లగొండ శరత్ చంద్ర అన్నారు. ఈమధ్య వారికి అందడం లేదనేది నా దృష్టికి రాలేదు పూర్తిగా విచారణ చేసి వెంటనే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.






