- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రహరీ నిర్మాణం అక్రమమా? సక్రమమా?
జమ్మికుంట పట్టణంలో కొన్ని రోజులుగా ఒక ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించిన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ,జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో కొన్ని రోజులుగా ఒక ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించిన అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంట పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను నిర్మిస్తున్న ఒక ప్రముఖ వైద్యుడు. తాను నిర్మిస్తున్న భవానానికి వెళ్లే గల్లీలో ప్రహారీ గొడను నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైంది. అయితే ఈ ప్రహారీ గోడను అక్రమంగా నిర్మించారని, దాన్ని కూల్చివేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వివాదాస్పదమైన ప్రహరీ గోడను ఏ గల్లీలో నిర్మించారో.. దానికి సంబంధించిన డాక్యుమెంట్‌లో కూడా ఆ గల్లీ అదర్స్ లేన్ అని ఉంది.
ఈ గల్లీ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కూడా గల్లీగానే ఉంది. ఈ గల్లీకి సంబంధించి, ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ.. తన ఇంటికి 100 ఫీట్ల దూరంలో కొత్తగా హాస్పిటల్ నిర్మిస్తున్న ప్రముఖ వైద్యుడు, పూర్తిగా ఆ గల్లీని బ్లాక్ చేసే విధంగా, కావాలని ఉద్దేశపూర్వకంగా, ఈ గోడను నిర్మించడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు తాను నిర్మిస్తున్న ఆస్పత్రి గల్లీలో నిర్మించిన ప్రహారీ గోడను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో సదరు వైద్యుడు అధికారులకు మామూళ్లు ఇచ్చాడని.. దీంతో అధికారులు సదరు వైద్యుడికే మద్దతుగా నిలుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అంతేకాదు.. ఇందులో పలువురు రాజకీయ నేతల హస్తం ఉందని.. వారికి భారీగా ముడుపులు ముట్టడంతోనే.. ఈ ప్రహారీ గోడను అక్రమంగా నిర్మించడానికి అధికారులు సహకరించారని స్థానికుల ఆరోపణ.
ఆ గల్లీని ఆక్రమించే కుట్ర ఉందా?
ప్రముఖ వైద్యుడు నిర్మిస్తున్న హాస్పిటల్ ముందున్న గల్లీలో ప్రహారీ గోడను నిర్మించడం వెనుక ఆ గల్లీని రానున్న కాలంలో పూర్తిగా స్వాధీనం చేసుకునే కుట్ర దాగి ఉన్నట్లు స్థానికులతో పాటు పట్టణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు వైద్యుడికి అలాంటి ఆలోచన లేకపోతే.. ఆ గల్లీలో ప్రహారీ నిర్మించాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆ గల్లీ సదరు వైద్యుడు నిర్మించే ఆస్పత్రికి ఎదురుగా ఉండటంతో.. దానిని ఇతరులు ఏ మాత్రం వినియోగించుకోకుండా చేయడంతో పాటు.. దానికి ఇరువైపుల ప్రహారీ గోడను నిర్మించడం ద్వారా దాన్ని కబ్జా చేసి.. అందులో ఇతర నిర్మాణాలు చేపట్టడం కానీ.. లేక తమ సొంత ల్యాండ్‌గా దాన్ని వినియోగించుకోవాలని సదరు వైద్యుడు కుట్ర చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తుండటంతో ఈ ప్రహారీ గోడ అంశం ఇప్పుడు జమ్మికుంట పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. అటు మున్సిపల్ అధికారులు, ఇటు ఆస్పత్రిని నిర్మిస్తున్న వైద్యుడిపై వచ్చిన మామూళ్ల ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి, ఈ వివాదానికి ముగింపు పలుకుతారా? లేదా.? దీన్ని ఇలాగే వదిలేస్తారా? అన్నది చూడాలి.






